కొన్ని తమిళ చిత్రాలు తెలుగులో భారీ అంచనాలతో విడుదల అవుతూ ఉంటాయి. ఆ సినిమాలలో హీరోలు తెలిసిన తెలవకపోయినా కూడా కంటెంట్ పరంగా ఏర్పడిన ఆసక్తి కారణం వల్ల ఈ చిత్రానికి క్రేజ్ పెరిగిపోతూ ఉంటుంది. విడుదల తర్వాత ఆ చిత్రం బాగుంటే తప్పకుండా మంచి కలెక్షన్లను కూడా రాబట్టుకుంటుంది. ఆ విధంగా ఇప్పటివరకు హీరోలతో సంబంధం లేని చాలా తమిళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించి భారీ స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టాయి.
ఆ విధంగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది అని చెప్పాలి. మణిరత్నం దర్శకత్వం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల చివర్లో విడుదల కాబోతూ ఉండగా ఈ చిత్రంపై తెలుగులో మంచి బజ్ క్రియేట్ అవ్వడం విశేషం. చాలా రోజుల తర్వాత మణిరత్నం ఒక భారీ బడ్జెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న చిత్రం కావడంతో అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. అయితే తెలుగులో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉన్నా కూడా చిత్ర బృందం ఇక్కడ ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలను చేయకపోవడం వారు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న ఆలోచన సినిమా విశ్లేషకులలో ఉంది.
ఇంతటి భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా యొక్క ప్రమోషన్ ను కీలకమైన తెలుగు మార్కెట్ లో చేయకపోవడం ఇప్పుడు ఆ సినిమా యొక్క అభిమానులను నిరుత్సాహపరుస్తుంది. విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలను తెలుగులో నిర్వహిస్తారా అనేది చూడాలి. విక్రమ్ కార్తీ అలాగే జయం రవి లాంటి పెద్ద హీరోలు నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. వారికి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కోసం వారి అభిమానులు ఎంతగానో ఆలోచిస్తున్నారు.