టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటిదాకా మంచి మంచి సినిమాలను చేసి మంచి అభిరుచి గల దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క యువ హీరో కూడా భావిస్తూ ఉంటాడు. తాజాగా ఆయన ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు.
రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాతో మళ్లీ మరొక విజయాన్ని అందుకోవడం ఖాయం అని భావిస్తున్నారు. అష్టా చ మ్మా సినిమా తో దర్శకుడిగా పరిచయమైన ఇంద్రగంటి మోహనకృష్ణ సుధీర్ బాబుతో చేస్తున్న ఈ సినిమా తరువాత చేయబోయే హీరోల లిస్టు భారీగానే కని పిస్తుంది. మొన్నటి దాకా ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి దర్శకత్వం అందిస్తున్నాడు అని వార్తలు రాగా మహేష్ బాబుతో ఆయన ఓ సినిమాను చేయబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవిని కూడా ఓ కథతో ఒప్పించాడు అని చెబుతున్నారు. ఏదేమైనా మీడియం రేంజ్ సినిమాలు చేసే దర్శకుడు ఈ విధంగా అగ్ర హీరోలతో సినిమాలు చేయడం మంచి విషయమే అయినా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. రేపు విడుదల కాబోతున్న సినిమా మంచి సక్సెస్ అందుకుంటే మాత్రం ఈ ముగ్గురు హీరోలలో ఎవరో ఒకరు ఈ దర్శకుడిని సినిమా చేయడం ఖాయం అని చెప్పవచ్చు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను రూపొందించడంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ది బెస్ట్ సినిమాలను చేస్తూ ఉంటాడు. అలాంటి ఓ కాన్సెప్ట్ సినిమా పెద్ద హీరోలతో చేసి సక్సెస్ అయితే మాత్రం ఈ దర్శకుడు అగ్ర దర్శకుడు జాబితాలో చేరడం ఖాయం అని చెప్పవచ్చు