SSMB28: ఇప్పటినుంచే భారీ బిజినెస్ ప్లాన్స్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు రీసెంట్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమైంది.అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి మాత్రం ఎక్కువ సమయం తీసుకున్నారు.ఎట్టకేలకు రీసెంట్ గా సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. షూటింగ్ మొదలుపెట్టడంతో పాటు సినిమా బిజినెస్ వ్యవహారాలను కూడా హ్యాండిల్ చేసినట్లు సమాచారం. డీల్స్ ఏవీ ఫైనల్ చేయలేదు కానీ డిస్కషన్స్ మాత్రం జరుగుతున్నాయి. నిర్మాతలు కోట్ చేస్తున్న రేట్లు వింటుంటే షాకింగ్ గానే ఉంది.ఓవర్సీస్ రైట్స్ కోసం రూ.23 కోట్లు డిమాండ్ చేస్తున్నారట.దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్ కోసం కోట్ చేస్తున్న మొత్తం రూ.100 కోట్లు. టాప్ ఓటీటీ సంస్థతో దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ను ఇంకా బేరం పెట్టలేదు. ఒక్కసారి హిందీ వెర్షన్ ఉందనేది డిసైడ్ అయితే అప్పుడు బిజినెస్ అనేది కన్ఫర్మ్ అవుతుంది.



ఆడియో రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తం వచ్చే ఛాన్స్ ఉంది. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికొస్తే.. నైజాం ఏరియా రూ.45 కోట్ల రేంజ్ లో ఉంటుందట. ఎందుకంటే అక్కడ 'అల.. వైకుంఠపురంలో' సినిమా రూ.42 కోట్లకు పైగా వసూలు చేసింది. అదే రేంజ్ లో మహేష్ సినిమాకి బేరం పెట్టారు. ఆంధ్రాలో రూ.50 కోట్లకు సినిమాను అమ్మాలని చూస్తున్నారు.సీడెడ్ రూ.20 కోట్ల రేంజ్ లో కోట్ చేస్తున్నారు. నిర్మాతలైతే.. థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.140 కోట్ల వరకు బిజినెస్ ఆశిస్తున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలుపుకొని మరో రూ.140 కోట్లకు కోట్ చేస్తున్నారు. మరి చూడాలి ఫైనల్ గా ఎన్ని కోట్లకు బిజినెస్ ఫిక్స్ అవుతుంది అనేది..? ఇక ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా రికార్డులు బద్దలు కొడుతుందని ఫ్యాన్స్ తో పాటు ఇంకా అలాగే కామన్ ఆడియన్స్ కూడా ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: