యంగ్ అండ్ ఎనర్జిటిక్
హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి
రామ్ పోతినేని తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ
హీరో గా కెరియర్ ని కొనసాగి స్తున్నాడు . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే
రామ్ పోతినేని 'ది వారియర్' అనే
మూవీ లో హీరోగా నటించాడు. ఈ
మూవీ లో కృతి శెట్టి
హీరోయిన్ గా నటించగా , తమిళ దర్శకుడు లింగసామి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు.
ఈ
మూవీ తెలుగు మరియు
తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇలా ది
వారియర్ మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరాశపరిచిన
రామ్ పోతినేని తన తదుపరి
మూవీ లను మాత్రం అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
రామ్ పోతినేని తన తదుపరి
మూవీ ని
టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నాడు.
ఇప్పటికే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ
మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఈ
మూవీ ని పాన్
ఇండియా మూవీ గా తెరకెక్కించ బోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ తర్వాత
రామ్ పోతినేని , గౌతమ్ వాసుదేవ్
మీనన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నాడు. తాజాగా
గౌతమ్ వాసుదేవ్
మీనన్ ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఇలా
రామ్ పోతినేని తన తదుపరి
మూవీ లను అదిరి పోయే రేంజ్ లో సెట్ చేసుకున్నాడు.