అరుదైన రికార్డు ను సాధించిన సమంత...!!
తెలుగు మరియు తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వరుస ప్రాజెక్ట్‌లతో మరింత బిజీ బిజీగా మారిపోయింది. ఉత్తరాదిన కూడా పలు సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక సౌత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో సమంత నే టాప్ ప్లేస్‌లో ఉంది. ప్రస్తుతం ఈమె మూడు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే సమంత ఓ అరుదైన ఘనతను కూడా సాధించిన విషయం తెలుసా
సౌత్‌లో సమంత ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అదేంటంటే ఎక్కువ 100 కోట్ల గ్రాస్ ఉన్న హీరోయిన్‌గా సమంత ఓ రికార్డును క్రియేట్ చేసింది. దూకుడు, అత్తారింటికి దారేది, కత్తి, తేరి, 24, జనతాగ్యారేజ్, మెర్సల్, రంగస్థలం వంటి వంద కోట్ల గ్రాసర్ సినిమాలలో సమంతనే హీరోయిన్‌గా నటించింది. ఈ అరుదైన రికార్డు ఇప్పటివరకు మరో హీరోయిన్ కూడా బ్రేక్ చేయలేదు. ప్రస్తుతం ఈమె నటిస్తున్న మూడు సినిమాల్లో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కావడం విశేషం. అందులో ఒకటి గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం మూవీ. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందట.. మరోకటి ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న యశోదా. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
వరుస సినిమాలతో తనలో నటనను మెరుగుపరుచుకుంటుంది. తన నటన తో పాన్ ఇండియా వైజ్ మంచి పేరు ప్రఖ్యతలు సంపాదించుకుంది.ఈ మధ్య పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో మరొక రికార్డు ను కూడా సాధించింది