కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారా..?
ఇక బరువెక్కిన గుండెతో బాధపడుతున్నప్పటికీ చెల్లెళ్లను , పెద్దమ్మను ఓదారుస్తూ ధైర్యం చెబుతూ అండగా నిలిచాడు. అంతేకాదు దగ్గరుండి కృష్ణంరాజు అంత్యక్రియలను నిర్వహించారు.. ఇకపోతే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు మరణంతో కీలక నిర్ణయం తీసుకున్నారు అనే వార్త వైరల్ అవుతుంది . ప్రస్తుతం పెదనాన్న మృతితో ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కుటుంబానికి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటివరకు ఒప్పుకున్న ప్రాజెక్ట్లన్నీ కూడా కొద్దిరోజులు పక్కకు పెట్టి కుటుంబంతోనే ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రభాస్ నిర్ణయానికి కూడా దర్శకనిర్మాతలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న సినిమాల విషయానికి వస్తే.. ఆది పురుష్, ప్రాజెక్టు కే, సలార్ వంటి భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నారు .అయినప్పటికీ కూడా ఈ నెల మొత్తం ఏ షూటింగ్లో కూడా ఆయన పాల్గొనకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఇకపోతే ప్రభాస్ తీసుకున్న నిర్ణయానికి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం పట్ల ఇంత బాధ్యతగా ఉండడం నిజంగా గ్రేట్ అంటూ కూడా ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.