దీపావళి కానుకగా కార్తి నటించిన సినిమా రిలీజ్..!!

Divya

తమిళ హీరో కార్తీ తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉందని చెప్పవచ్చు హీరో సూర్య తమ్ముడు గా మంచి పేరు సంపాదించారు. తెలుగులో కార్తీ సినిమాలు విడుదలయ్యేదానికి తన సినిమాలకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా హీరో విక్రమ్ తో కలిసి నటించిన పీరియాడికల్ చిత్రం పోన్నియిన్ సెల్వన్-1 ఈ సినిమా ఈనెల 30వ తేదీన ఒకేసారి పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రము విడుదల కాబోతున్నది. డైరెక్టర్ మణిరత్నం డ్రిమ్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది. కార్తీ నటిస్తున్న మొదటి పీరియాడికల్ చిత్రం కావడంతో ఆయన అభిమానులు కూడా ఈ సినిమాపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.

ఇదంతా ఇలా ఉండగా హీరో కార్తీ నటిస్తున్న మరొక విభిన్నమైన స్పై యాక్షన్ త్రిల్లర్ చిత్రం త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పేరు సర్దార్. ఈ చిత్రాన్ని పీఎస్ మిత్ర దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక ,రజిషా విజయన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం భారీ అంచనాలతో నెలకొంది. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుగులో తెలుస్తోంది. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ లైలా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతోంది. ఈ చిత్రంలో హీరో కార్తీ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు.

దీపావళి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు సమాచారం త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని డైరెక్టర్ ఒక పోస్టర్ ద్వారా షేర్ చేసి ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నారు. ఇక ఆ పోస్టర్ విషయానికి వస్తే ఒకపక్క ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా.. మరొకపక్క మాసిన గడ్డంతో చాలా గ్యాంగ్ స్టార్ గా కనిపిస్తున్నారు కార్తీ. మరి ఈ సినిమా కార్తీక్ ను మరొకస్థాయిని పెంచుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: