అయ్యో!మృనాల్ ఠాకూర్ ఇలా అయిపోయిందేంటి...?
అలాగే మంచి హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది. సీతారామం సినిమాలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఈ సినిమా విడుదల అయిన తరువాత తరచుగా ఏదో ఒక విషయంపై మృణాల్ ఠాకూర్ పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తూనే ఉంది. ఈ సినిమాలో ఆమె నటన పై ఇప్పటికే పలువురి ప్రముఖులు అభిమానులు సైతం ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ ముద్దుగుమ్మను ఫాలో అయ్యే వారి సంఖ్య మరింత పెరిగింది. ఇక సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అదే జోష్ లో సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ మరింత పాపులారిటీని కూడా సంపాదించుకుంది. కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో మృణాల్ ఠాకూర్ మీరు కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగచెక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోని చూస్తుంటే ఇప్పుడు ఉన్న మృణాల్ ఠాకూర్ ఆ ఫోటోలు కనిపిస్తున్న మృణాల్ ఠాకూర్ ఒకరేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆ ఫోటోలో మృణాల్ ఠాకూర్ చేతులు, ముఖం మొత్తం నల్లగా ఉన్నాయి. ఆమె తన చేతుల్ని పైకి ఎత్తి చూపిస్తూ ఉంది. ఆ ఫోటోని చూసిన నెటిజెన్స్ సీతారామం సినిమాలో హీరోయిన్ కు ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆమెకు ఎక్కడ పోలిక లేదంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ ఫోటోను చూసిన పలువురు నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఆమె ఒరిజినల్ లుక్ ఇంత నల్లగా ఉంటుందా అని కామెంట్స్ చేయగా, మరి కొంతమంది ఆమె స్కిన్ ఎలర్జీకి గురైంది అందుకే అలా ముఖం కమీలి పోయి నల్లగా మారింది అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. కానీ ఈ ఫొటో వెనకాల ఉన్న అసలు వాస్తవాలు ఏంటి అన్నది ఎవరికీ తెలియటం లేదు. మరి కొంతమంది ఆ ఫోటోని చూసి మృణాల్ ఠాకూర్ తన తదుపరి సినిమా కోసం ఆ విధంగా గెటప్ వేసిందా అన్న అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారట.