బిగ్ బాస్ :నాగార్జున పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్...!!
బిగ్ బాస్ రియాల్టీ షో కూడా అభిమానుల్ని కలిగి వుందా.? అన్న డౌటానుమానాలు మనకు వస్తున్నాయ్ చాలామందికి. కంటెస్టెంట్లను ట్రోల్ చేయడానికీ, హోస్ట్ మీద సెటైర్లేయడానికైనా చాలామంది బిగ్ బాస్‌ని బాగా ఫాలో అవుతుంటారు.
నిజానికి అయితే వాళ్ళ సంఖ్యే ఎక్కువ.!
కంటెస్టెంట్లు పీఆర్ బృందాల్ని పెట్టుకున్నా, ఆఖరికి బిగ్ బాస్ నిర్వాహకు లు కూడా నానా తంటాలూ పడి పబ్లిసిటీ స్టంట్లు చేసినా.. సోషల్ మీడియాలో జరిగేది మాత్రం బిగ్ ర్యాగింగే మరి.హోస్ట్ నాగార్జున కూడా ఈ ర్యాగింగ్ బాధితుడే.!
'ఆడటానికి వచ్చారా.? ఎందుకొచ్చారు.. ఏం చేస్తున్నారు..' అంటూ కుండలు బద్దలుగొట్టేశాడ ట హోస్ట్ అక్కినేని నాగార్జున. సినిమాల్లో ఇంతకన్నా సీరియస్ యాక్టింగ్ నాగ్ చాలాసార్లు అయితే చేసేశాడు. కానీ, బుల్లితెరపై చేస్తోంటేనే కామెడీ అయిపోతోందట.
'ఏంటయ్యా నాగార్జునా నీ ఓవరాక్షనూ..' అంటూ నెటిజన్లు మండిపడుతున్నారట.. అసలంటూ కంటెస్టెంట్ల కు సరైన టాస్కులు బిగ్ బాస్ ఇవ్వడంలేదాయె.! ఒక్క మాటలో చెప్పాలంటే నసన్నర నస.! బిగ్ బాస్‌కి గతంలో ఎన్నడూ లేనంత పూర్ రేటింగ్స్ అయితే వస్తున్నాయి.
హౌస్ మేట్స్ అంతా జస్ట్ టైమ్ పాస్ చేస్తున్నారంటే, ఆ తప్పు బిగ్ బాస్‌ది కూడా.! బిగ్ బాస్ మీద నాగ్ ఎలాగూ అరవలేడు గా. పేమెంట్ తీసుకుంటాడు కాబట్టి, ఆర్డర్స్ ప్రకారం కంటెస్టెంట్ల మీద మాత్రమే అరుస్తుంటాడంతే.బిగ్ బాస్ సీజన్ 1ఎన్టీఆర్ హోస్టింగ్ తో అద్భుతమైన రేటింగ్స్ అయితే వచ్చాయి. అదే ఊపు తో రెండో సీజన్ కు కూడా ఎన్టీఆర్ ని తీసుకోవాలనుకున్న తన కి ఉన్న కమిట్మెంట్ వల్ల కుదరలేదు. సీజన్ 2 కు నాని ని హోస్ట్ గా ఎంచుకున్నారు. అది అంతంత మాత్రమే రేటింగ్స్ వచ్చాయి. ఆ తరువాత వరుసగా 6వ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. మొదట్లో రేటింగ్స్ బాగా వచ్చిన రానురాను రేటింగ్స్ తగ్గిపోయాయి...