7 భాషలలో విడుదల కానున్న కబ్జా...!!

murali krishna
ఒకప్పుడు కన్నడ సినిమాలకు ఇతర ఇండస్ట్రీలలో అంతగా గుర్తింపు ఉండేది కాదు. మన వాళ్లు కన్నడ సినిమాలను ఎప్పుడు తక్కువగానే చూసేవారు. ఈ క్రమంలో 'కేజీఎఫ్' సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు దేశమంతటా మారుమోగిపోయింది, దీనికి కారణం డైరెక్టర్ ప్రశాంత్.

ఇక అప్పటి నుండి కన్నడ సినిమాలను విపరీతమైన ఆదరణ పెరిగింది. ‘కేజీఎఫ్’ తర్వాత కన్నడ సినిమాల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కిస్తూ పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడుతున్నారు. ఇటీవలే విడుదలైన కన్నడ చిత్రం ‘విక్రాంత్ రోన’ కూడా పాన్ ఇండియా లెవల్లో మంచి విజయం సాధించింది, మంచి వసూళ్లు సాధించింది.

ఈ నేపథ్యంలో మరో కన్నడ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమైంది. కన్నడ స్టార్‌లు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘కబ్జా’. ఆర్‌.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘కేజీఎఫ్’ తర్వాత ఆ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో విజువల్స్ గాని, సెట్టింగ్స్ గాని కేజీఎఫ్ రేంజ్‌లో ఉన్నాయి, సినిమా లో మ్యూజిక్ మాత్రం వేరే లెవల్ ఇద్దరు హీరోలు ఒకే స్క్రీన్‌పై పోటా పోటిగా నటించడంతో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. మళ్లి కేజీఎఫ్ లాంటి హై యాక్షన్ సినిమాను కన్నడ నుండి చూడబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. రవిబస్రూర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా కథ 1947 నుండి 1990 మధ్య జరుగుందట. అనుకోని పరిస్థితుల్లో ఓ స్వాతంత్ర సమరయోధుడి కొడుకు మాఫీయా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అని కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ చిత్రంలో శ్రియాశరణ్ కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఏకంగా 7 భాషల్లో విడుదల కానుంది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠి, బెంగాళీ భాషల్లో విడుదల కానుంది. అంతేకాకుండా ఏడు భాషల్లో విడుదలవుతున్న మొదటి కన్నడ సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: