లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల నయన్ -డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఏడేళ్ల ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి....పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.ఇక ఈ ఏడాది జూన్‌లో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకుని ఓ ఇంటి వారైన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ప్రస్తుతం ఇద్దరు వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ఇక విదేశాలకు చెక్కేస్తూ.. ఫుల్‌గా రిలాక్స్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ కొత్త జంట వారి జీవితంలోని ప్రతి మూమెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇకపోతే పెళ్లైన ఏడాదిలో వచ్చే బర్త్‌డే అంటే మరింత స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.ఇక నయన్ కూడా అదే పని చేసింది.
భర్త విఘ్నేష్ శివన్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. కాగా తమ పెళ్లి తర్వాత భర్త విఘ్నేష్ శివన్ సెలబ్రేట్ చేసుకుంటోన్న ఫస్ట్ బర్త్‌డే కావటంతో నయనతార గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడమే కాక.. పుట్టిన రోజు సందర్భంగా భర్తకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది.అయితే విఘ్నేశ్ శివన్ బర్త్‌డేని దుబాయ్‌లోని బుర్జ్ ఆఫ్ ఖలీఫా దగ్గర సెలబ్రేట్ చేసింది నయనతార. ఇకపోతే ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా పేరున్న బుర్జ్ ఖలీఫా ముందు విఘ్నేష్ శివన్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఇక ఆమెతో పాటు విఘ్నేష్ శివన్ కుటుంబ సభ్యులు కూడా బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. భార్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసి విఘ్నేష్ శివన్ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇక ఈ మేరకు విఘ్నేష్ తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.ఆయాన...''పుట్టిన రోజు సందర్భంగా నా భార్య నయనతార అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చింది.అంతేకాదు తను నా బంగారం. నన్నెంతో ప్రేమించే వ్యక్తుల మధ్య బుర్జ్ ఖలీఫా దగ్గర బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవటం కలలాగా ఉంది.ఇమ. దీని కంటే ప్రత్యేకతను నేను నా లైఫ్‌లో ఊహించలేను. అయితే ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని, మరచిపోలేని క్షణాలను నాకు ఇచ్చిన ఆ భగవంతుడికి ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను'' అంటూ పోస్ట్ చేశాడు.అయితే ఇక పెళ్లి తర్వాత నయనతార ననటకు గుడ్‌బై చెప్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ వార్తలన్నీ అవాస్తవాలనీ తేలిపోయాయి.కాగా ఆమె షారూక్ ఖాన్ సినిమాను పూర్తి చేయటమే కాక.. నయన్ 75 వ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేసింది.ఇక నీలేష్ కృష్ణ నయనతార 75వ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు..!!