టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఆ సినిమాలను అంతే వేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు. అంతేకాదు ఏక కాలంలో రెండు సినిమాల షూటింగులు చేస్తూ యంగ్ హీరోల కన్నా బిజీ షెడ్యూల్స్ తో యాక్టివ్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.అయితే ఈయన నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా రేస్ లో బరిలోకి దిగబోతుంది.ఇకపోతే ఇది రిలీజ్ కు లైన్ క్లియర్ అవ్వగానే మరో సినిమాను అంతే వేగంగా పూర్తి చేసే పనిలో చిరు ఉన్నాడు.
ఇదిలావుంటే. ప్రెసెంట్ టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాల్లో వాల్తేరు వీరయ్య (వర్కింగ్ టైటిల్) ఒకటి.ఇకపోతే. మెగాస్టార్ 154వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇదిలావుంటే ఇటీవలే హైదరాబాద్ లో షెడ్యూల్ స్టార్ట్ చేసి పూర్తి చేసారు.అయితే ఇక రేపు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. కాగా రేపటి నుండి రాజమండ్రి లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి మెగాస్టార్, రవితేజ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించ నున్నారట..
అంతేకాకుండా మరి ఒకవైపు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రొమోషన్స్ స్టార్ట్ అవుతుండగానే కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇక దీంతో మెగాస్టార్ ఎలా మ్యానేజ్ చేస్తాడో చూడాలి.. అయితే ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాస్ రాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.ఇకపోతే movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.అంతేకాకుండా. అలాగే 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు..!!