మిల్కీ
బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో
మూవీ లలో నటించిన
తమన్నా ఇప్పటికి కూడా తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్
క్రేజీ
హీరోయిన్ గా కెరియర్ ని కొనసాగిస్తుంది. సినిమాల్లో కేవలం
హీరోయిన్ పాత్రలు మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పాత్రలు మరియు ఐటమ్ సాంగ్ లలో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కొంత కాలం క్రితం ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో 11త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించింది.
ఇలా తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన 11త్ అవర్ వెబ్ సిరీస్ ను తమిళం లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆహా 'ఓ టి టి' సంస్థ తాజాగా అధికారికంగా ధ్రువీకరించింది. మరి తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన 11త్ అవర్ వెబ్ సిరీస్
తమిళ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే
తమన్నా తెలుగు తో పాటు
తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అనేక
మూవీ లలో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మిల్కీ
బ్యూటీ తమన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా
మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా
శంకర్ మూవీ లో
హీరోయిన్ గా నటిస్తుంది. ఈ
మూవీ లో
చిరంజీవి కి చెల్లెలు పాత్రలో
కీర్తి సురేష్ నటిస్తోంది.