ప్రస్తుతం ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే
హెబ్బా పటేల్ తాజాగా శాసనసభ అనే పాన్
ఇండియా మూవీ లో స్పెషల్ సాంగ్ చేస్తోంది. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా నటిస్తున్న ఈ
మూవీ కి వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఓ ప్రత్యేక సాంగ్ కోసం
హెబ్బా పటేల్ ను తీసుకున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన
రెడ్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించిన
హెబ్బా పటేల్ 'శాసనసభ'
మూవీ లోని స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.