తమిళ
సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలుగా కొనసాగుతున్న తళపతి
విజయ్ ,
అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి అంటే
తమిళ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ లో సందడి ఉంటుంది. అలాగే వీరిద్దరి
మూవీ లకు మొదటి రోజు ఎలాంటి టాక్ తో సంబంధం లేకుండా అదిరి పోయే రేంజ్ కలెక్షన్ లు
తమిళ బాక్సా ఫీస్ దగ్గర లభిస్తూ ఉంటాయి.
ఇది ఇలా ఉంటే 2023
పొంగల్ కి వీరిద్దరి సినిమాలు కూడా బాక్సా ఫీస్ దగ్గర విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం తలపతి
విజయ్ ,
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ తమిళ్ మరియు తెలుగు రెండు భాషలలో విడుదల కాబోతోంది.
తమిళ్ లో ఈ
మూవీ వరసు అనే టైటిల్ తో విడుదల కానుండగా , తెలుగు లో ఈ
మూవీ వారసుడు అనే టైటిల్ తో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ
మూవీ ని 2023
పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే
కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
అజిత్ ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తునివు అనే
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన
పోస్టర్ లను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ
పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ
మూవీ ని కూడా వచ్చే సంవత్సరం
పొంగల్ సీసన్ లోనే విడుదల చేయాలని
మూవీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒక వేళ ఈ రెండు సినిమాలు కనుక
పొంగల్ సీసన్ కు విడుదల అయినట్లు అయితే
తమిళ బాక్సా ఫీస్ దగ్గర భారీ యుద్ధమే జరిగే అవకాశం ఉంది.