టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో బిచ్చగాడు సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. ఇక విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వచ్చాయి.ఇక తాజాగా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.అయితే ఎప్పుడూ నేను హ్యాపీగా ఉంటానని ఆయన అన్నారు. ఈ సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే మాత్రం కొంచెం ఫీల్ అవుతానని ఆయన తెలిపారు.
ఇకపోతే 100 సినిమాలు అప్పుడే చేశానా అని అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.అయితే పెళ్లిసందడి లాంటి సినిమా చేయాలని చాలామంది కామెంట్లు పెడతారని ఆయన తెలిపారు.కాగా రాఘవేంద్రరావు గారు అందరు హీరోలు ఇష్టపడే డైరెక్టర్ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక తారకరాముడు సినిమా ఫ్లాప్ అయినా ఆ పాత్ర నాకు నచ్చుతుందని ఆయన తెలిపారు.అంతేకాదు ఫ్యామిలీ సబ్జెక్ట్ లకు బిల్డప్ లు ఎక్కువగా ఉండవని ఆయన చెప్పుకొచ్చారు. ఫ్యామిలీని బట్టి పిల్లల ప్రవర్తన ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.అయితే పిల్లలను మనం రుద్దేసి సినిమాల్లోకి పంపించడం కరెక్ట్ కాదని ఆయన చెప్పుకొచ్చారు.
ఇక మంచి పాత్రలు వస్తే విలన్ రోల్స్ లో చేయడంలో తప్పు లేదని ఆయన కామెంట్లు చేశారు.కాగా బిచ్చగాడు సినిమాలో నటించే అవకాశం మొదట నాకే వచ్చిందని ఆయన తెలిపారు.అయితే బిచ్చగాడు తెలుగు వెర్షన్ లో నటించే అవకాశం నాకు వచ్చిందని ఆయన చెపుకొచ్చారు.ఆ సినిమా రేటు విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని శ్రీకాంత్ తెలిపారు. ఇక తెలుగులో మదర్ సెంటిమెంట్ పెంచుదామని అనుకున్నానని రీమేక్ కు ఎక్కువ మొత్తం అడగడంతో ఆ సినిమా నుంచి బయటకు వచ్చానని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు..!!