బాలీవుడ్
బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తాజాగా లైగర్ అనే తెలుగు
మూవీ లో
హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన
పూరి జగన్నాథ్ ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ ఆగస్టు 25 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇలా ప్రేక్షకులను బాక్సా ఫీస్ దగ్గర పెద్దగా మెప్పించ లేకపోయినా ఈ
మూవీ తాజాగా అనగా ఈ రోజు నుండి అనగా
సెప్టెంబర్ 23 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' లో ప్రసారం అవుతుంది. ఇది ఇలా ఉంటే లైగర్
మూవీ విడుదలకు ముందు ఈ
మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అలా తెలుగు సినీ ప్రేమికులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో ఈ
మూవీ విడుదలకు ముందు
అనన్య పాండే కు కూడా తెలుగు
సినిమా ఇండస్ట్రీ నుండి అదిరిపోయే క్రేజీ ఆఫర్ లు వచ్చినట్లు , దానితో ఈ ముద్దు గుమ్మ సినిమాకు దాదాపు 4 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే కొంత మంది
ప్రొడ్యూసర్ లు కూడా ఈ ముద్దు గుమ్మ కు 4 కోట్లు ఇవ్వడానికి కూడా రెడీ కాగా లైగర్
మూవీ విడుదల అయ్యి గోరా పరాజయం చెందిన తర్వాత తెలుగు ఫిలిం మేకర్లు
అనన్య పాండే కు ఆ రేంజ్ లో పారితోషకం ఇవ్వడానికి కాస్త వెనకాడుతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే లైగర్
మూవీ ఫ్లాప్ అయినప్పటికీ
అనన్య పాండే కు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మాత్రం మంచి క్రేజీ లభించింది.