నాగశౌర్య సినిమాలో మిస్టేక్స్ ఏంటో తెలుసా...?

murali krishna
నాగ శౌర్య మంచి టాలెంట్ ఉన్న నటుడు. అలాగే మంచి డిసిప్లిన్ కలిగిన నటుడు కూడా.! అతని 'డౌన్ టు ఎర్త్' మనస్తత్వమే అతనికి యూత్ లో అంత క్రేజ్ ఏర్పడేలా చేసింది.


లాయల్ ఫ్యాన్స్ కూడా పెరిగేలా చేసింది. 'ఊహలు గుస గుస లాడే' 'దిక్కులు చూడకు రామయ్య' 'కళ్యాణ వైభోగమే' 'జ్యో అచ్యుతానంద' వంటి డీసెంట్ హిట్లతో క్రేజ్ సంపాదించుకున్న నాగ శౌర్య కి 'ఛలో' చిత్రం మంచి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఇంకా కొన్ని యావరేజ్ సినిమాలు కూడా ఉన్నాయి కానీ అతని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే 'ఛలో' అనే చెప్పాలి. కొన్నాళ్లుగా అతను ఆ సినిమాని మించి హిట్ ఇవ్వలేకపొతున్నాడు.


గత ఏడాది వచ్చిన 'వరుడు కావలెను' 'లక్ష్య' చిత్రాలు మంచి టాక్ ను సంపాదించుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయాయి. దీంతో కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన పరిస్థితి నాగ శౌర్యకి ఏర్పడిందట.. ఈ క్రమంలో అతని నుండి వచ్చిన లేటెస్ట్ మూవీ 'కృష్ణ వ్రింద విహారి'. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఈరోజు(సెప్టెంబర్ 23న) రిలీజ్ అయ్యింది. ఆ మూవీ. మొదటి షో నుండి ఈ మూవీకి పర్వాలేదు అనిపించే విధంగా టాక్ వస్తుంది కానీ కొన్ని మైనస్సులు లేకపోతే సూపర్ హిట్ టాక్ వచ్చేది అనేది కొందరి అభిప్రాయం. ఆ మైనస్సులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :


1) ఈ మధ్యనే నాని నటించిన 'అంటే సుందరానికి' చిత్రం రిలీజ్ అయ్యింది. 'కృష్ణ వ్రింద విహారి' కథకి ఆ చిత్రం కథకి చాలా దగ్గర పోలికలు అయితే ఉంటాయి. ఎవరి ఐడియాని ఎవరు కాపీ కొట్టారో తెలీదు కానీ.. ఆ సినిమాని నాని వల్ల ఎక్కువ మంది చూడటం వల్ల…'కృష్ణ వ్రింద విహారి' దానికి కాపీలా అయితే అనిపిస్తుంది.


2) ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఐటీ ఆఫీస్ సీన్లు చాలా ఇరిటేట్ చేస్తాయి. కమెడియన్స్ తో మేనేజ్ చేయాలని దర్శకుడు కవర్ చేసే ప్రయత్నం చేశాడు కానీ అది పూర్తిస్థాయిలో సక్సెస్ అయినట్లు అయితే అనిపించదు.


3) బ్రాహ్మణ కుటుంబం నుండి సిటీకి వచ్చిన అబ్బాయిగా నాగ శౌర్య చాలా చక్కగా నటించాడు. అందుకు అతను స్పెషల్ గా వర్కౌట్ చేసినట్టు కూడా తెలిపాడు.ఈ విషయంలో కొంతమంది అతని పై విమర్శలు గుప్పించే ప్రయత్నం కూడా చేశారు కానీ.. శౌర్య చెప్పింది నిజమే. బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు కొంత ట్రెడిషన్ ఫాలో అవుతారు. దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. బయట వాళ్ళు దానిని చాదస్తం అని కూడా అనుకుంటారు. అయితే ఈ చిత్రంలో పాత్ర మరీ శౌర్య చెప్పిన స్థాయిలో ఉండదు. పర్ఫెక్షన్ కోసం అతను ఈ పాత్రకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉండొచ్చు.


4) హీరోయిన్ షెర్లీ బాగానే చేసింది కానీ ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తేలిపోయినట్టు అనిపిస్తుంది.


5) హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, మరియు లవ్ సీన్స్ కూడా బాగా విసిగిస్తాయి.


6) బ్రహ్మాజీ కామెడీ ట్రాక్ ఈ సినిమాలో అదిరిపోతుంది అని ముందు నుండి చిత్ర బృందం చెప్పుకొచ్చింది. ఆ స్థాయిలో అయితే లేదు అనే చెప్పవచ్చు.


7) 'అంటే సుందరానికి' తో పాటు అక్కడక్కడా 'అదుర్స్' 'దువ్వాడ జగన్నాథం' ఛాయలు కనిపించడం కూడా ఓ మైనస్ అని చెప్పవచ్చు.


8) ఎమోషనల్ సన్నివేశాలు కూడా సాగదీసిన ఫీలింగ్ ను కలిగిస్తాయి.


9) రన్ టైం 2 గంటల 19 నిమిషాలు మాత్రమే ఉన్నా.. ఇంకా కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది.


10) ఒకటి, అర పాటలు తప్ప.. మిగిలినవి కూడా పెద్దగా ఆకట్టుకోవు. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: