సమంత అమెరికా ఎందుకు వెళ్లిందో తెలుసా...?

murali krishna
స్టార్ హీరోయిన్ సమంతపై ఈ మధ్య ఏ విధంగా వార్తలు వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. నాగచైతన్య తో విడాకుల అనంతరం కొంతకాలం పాటు ఆమె నిత్యం వార్తలలో నే నిలిచింది.


మళ్లీ ఈ మధ్య 'కాఫీ విత్ కరణ్' షోలో చైతూపై చేసిన వ్యాఖ్యలతో ఆమె హైలెట్ అయింది. ఆ షో తర్వాత మళ్లీ ఇప్పుడు ఆమె స్కిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందని, అందుకే షూటింగ్స్ అన్నీ ఆపేసి.. చికిత్స నిమిత్తం యూఎస్ వెళ్లిందనేలా వార్తలు కూడా దర్శనమిస్తున్నాయి. అయితే ఈ వార్తలు నిజం కావని, కేవలం అవి రూమర్స్ మాత్రమేనని.. రీసెంట్‌గా ఆమె మేనేజర్ మహేంద్ర  క్లారిటీ ఇచ్చినా కూడా.. ఆ వార్తలు ఆగడం లేదు. దీంతో అసలు సమంత అమెరికా ఎందుకు వెళ్లినట్లు? అనే దానిపై మీడియా ఫోకస్ పెట్టిందట..


అయితే వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. సమంత అమెరికా వెళ్లడానికి కారణం.. స్కిన్ ప్రాబ్లమ్ కాదని, త్వరలో ఆమె చేయబోయే వెబ్ సిరీస్ కోసం శిక్షణ తీసుకునేందుకేనని తెలుస్తోంది. రస్సో బ్రదర్స్  టెలివిజన్ సిరీస్ అయిన 'సిటాడెల్' ను ఇండియన్ వెర్షన్‌లో 'ది ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్, డికెలు డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించబోతోంది. రాజ్, డికె ల 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన సమంత.. ఇప్పుడు మరోసారి.. వారి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'సిటాడెల్' ఇండియన్ సిరీస్‌లో చేసేందుకు సైన్ చేసినట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇందులో సమంత అసమాన ధైర్యసాహసాలతో నిండిన బలమైన పాత్ర చేస్తుందని, అందుకే ఆ పాత్రకి ముందుగానే శిక్షణ తీసుకుంటుందని, అందు నిమిత్తమే ఆమె అమెరికా వెళ్లినట్లుగా సమాచారం. మరి ఈ విషయం క్లారిటీగా చెప్పేస్తే పోయేది.. దాచి పెట్టడం వల్ల ఉపయోగం ఏమిటో వారికే తెలియాలి.


ఇక సమంత నటించిన 'శాకుంతలం'  చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 4న ఈ దృశ్యకావ్యాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధం చేస్తున్నామని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి ఎపిక్ ఫిల్మ్‌ మేకర్ గుణశేఖర్ దర్శకుడు. ఈ సినిమా కాకుండా సమంత నటించిన మరో పాన్ ఇండియా సినిమా 'యశోద' కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీని కూడా త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న 'ఖుషి' చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమాకి శివనిర్వాణ దర్శకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: