ఆ హీరోకి.. విలన్ గా నటించాలనుంది : గౌతమ్ మీనన్
ఇప్పుడు వరకు ఇండస్ట్రీలో ఎన్నో ఫీల్ గుడ్ ప్రేమ కథలను అందించాడు ఈయన. ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కదిలించాడు అని చెప్పాలి. ఇక సూర్య సన్నాఫ్ కృష్ణన్, సాహసం శ్వాసగా సాగిపో లాంటి ఎన్నో మధుర అనుభూతులను మిగిల్చిన ప్రేమ కావ్యాలను సినిమాలుగా మలిచి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అయితే దర్శకుడిగా మాత్రమే సెటిల్ అవ్వకుండా నటుడిగా కూడా రాణిస్తూ ఉన్నాడు గౌతమ్ మీనన్. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటుడిగా కూడా ప్రేక్షకులను అలరించాడు అన్న విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే తనకు ఎలాంటి పాత్రలో నటించాలని ఉంది అన్న విషయం పై నోరు విప్పుతూ మనసులో మాట బయటపెట్టాడు గౌతమ్ మీనన్. తనకు విలన్ గా నటించాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తమిళ సూపర్‌స్టార్ అయిన ఇళయ దళపతి విజయ్ కి విలన్ గా నటించాలని ఉంది అంటూ మనసులో ఉన్న కోరికను అభిమానులతో పంచుకున్నాడు. కాగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తనకెక్కుతున్న సినిమాలో అజిత్ కుమార్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో గౌతం మీనన్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు రాగా.. అదంతా ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. కానీ అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోను అంటూ చెప్పుకొచ్చాడు గౌతమ్ మీనన్.