మహేష్ బాబు మేకప్ లేకుండా నటించిన సినిమా ఏంటో తెలుసా..?
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.. చాలా కాలం నుంచి పెండింగ్ పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది . ఇక ఈ సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు మహేష్ బాబు. ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి నెట్టింట్లో బాగా వైరల్ గా మారుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోని ఈయనకు సంబంధించిన ఒక వార్త బాగా హాట్ టాపిక్ గా మారింది అదేమిటంటే మహేష్ బాబు తన కెరీర్ లోని మేకప్ లేకుండా నటించిన సినిమా ఏంటని అభిమానుల సైతం ఆరా తీస్తున్నారు..
మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయిన నిజం సినిమా తేజ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకప్ కూడా వేసుకోలేదు. ఇక ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే కలెక్షన్ పరంగా డిజాస్టర్ అయినప్పటికీ కథ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.. ఇక ఏది ఏమైనా ఇలా మొదటిసారి మేకప్ లేకుండా కెమెరా ముందు కనిపించారు.