నయనతార తల్లి కాబోతుందా...?
గత ఏడు సంవత్సరాల నుంచి నయనతార విగ్నేష్ ప్రేమలో ఉండి ఏడాది జూన్ 9వ తేదీన వీరిద్దరూ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.
ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ జంటకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దర్శకుడు విగ్నేష్ చేసిన పోస్ట్ చూస్తుంటే త్వరలోనే నయనతార అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా ఈమె తల్లి కాబోతున్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా ముగ్గురు పిల్లలతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.. పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాము భవిష్యత్తు కోసం ప్రాక్టీస్ చేయాలి కదా అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్ట్ షేర్ చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు నయనతార త్వరలోనే తల్లి కాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా నయనతారకు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయంపై ఈ జంట అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.ఇక నయనతార సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానుంది.