అలాగే
ఆది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుత మైన కలెక్షన్ లను కూడా కొల్ల గొట్టింది. ఇలా అప్పట్లో భారీ
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను కొల్ల గొట్టిన
ఆది మూవీ ని తిరిగి మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
ఆది మూవీ ని ఈ సంవత్సరం
నవంబర్ మూడవ వారంలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ అదిరిపోయే రేంజ్ లో కొనసాగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొంత మంది తెలుగు స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను ప్రేక్షకుల నుండి తెచ్చుకున్నాయి. మరి
ఆది మూవీ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.