టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం సినిమాలకే పరిమితమైనా తారక్ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా తన మార్కును చూపించాలని అభిమానులు భావిస్తున్నారు.ఇదిలావుంటే ఇక టాలీవుడ్ ప్రముఖ రచయితలలో ఒకరైన కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే వెంకీ సినిమా నుంచి శ్రీనువైట్లతో కలిసి పని చేశానని కోన వెంకట్ వెల్లడించడం గమనార్హం.ఇక ఇండస్ట్రీకి గుర్తింపు కోసం వస్తామని ఆ గుర్తింపు లేని సమయంలో బాధ కలుగుతుందని ఆయన తెలిపారు.
అయితే టీమ్ వర్క్ ఉంటేనే విజయం దక్కుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతెందుకు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని కోన వెంకట్ కామెంట్లు చేశారు.ఇక బ్రూస్ లీ హిట్టై ఉంటే మా కాంబినేషన్ కొనసాగేదేమో అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే వినాయక్ ను ఒత్తిడి చేస్తే వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరని ఆయన తెలిపారు.ఇక సినిమాను హిట్ ఎలా చేయాలన్న ఒత్తిడిని మాత్రమే వినాయక్ తీసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.కాగా సాంబ, అదుర్స్ సినిమాల సమయంలో పాలిటిక్స్ అంటే తారక్ కిలోమీటర్లు పారిపోయేవాడని కోన వెంకట్ కామెంట్లు చేశారు.
అంతేకాదు మనకెందుకన్నా అని ఆయన అనేవారని కోన వెంకట్ అన్నారు.ఇక చిన్న వయస్సులో తారక్ పెద్ద బాధ్యతలు తీసుకున్నారని కోన వెంకట్ కామెంట్లు చేశారు.అయితే వయస్సు, అనుభవం లేకపోయినా తారక్ కంట్రోల్ చేసేవారని ఏ విషయంలోనైనా తారక్ దే తుది నిర్ణయమని కోన వెంకట్ అన్నారు. ఇక కుంభస్థలాన్ని కుట్టాలని హై గోల్ తో తారక్ కెరీర్ ను కొనసాగించాడని కోన వెంకట్ కామెంట్లు చేశారు. అయితే కోన వెంకట్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం..!!