స్టార్ హీరో భార్య కి ఆ ప్రాబ్లెమ్... హాస్పిటల్ లో అడ్మిట్...!!
ప్రజెంట్ జ్యోతిక హాస్పిటల్ అడ్మిట్ అయిందా..?" ఇలా,టి ప్రశ్నలే సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో సర్కులేట్ అవుతున్నాయి . మనకు తెలిసిందే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తాము సినిమాలో నటించే టైంలోనే ప్రేమించుకున్న ఈ జంట.. ఇంట్లో ఒప్పుకోరు అనే భయంతో షూటింగ్ స్పాట్ నుంచి పారిపోయి.. మరి గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం బయటకు చెప్పకుండా కొన్నాళ్లు మెయింటైన్ చేసిన ఈ జంట.. ఆ తర్వాత ఇంట్లో పెద్దలకు మ్యాటర్ చెప్పడంతో.. ఇంట్లోని పెద్దవారు అరిచి గోల చేసి.. ఆ తర్వాత కూల్ అయ్యి.. మళ్లీ వాళ్ళ సంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా హీరో సూర్య, హీరోయిన్ జ్యోతిక పెళ్లి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు.
పెళ్లి తర్వాత కూడా ఈ జంట సినిమాల్లో సందడి చేసింది . వరుస సినిమాలతో సూర్య.. కీలకపాత్రలో, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో జ్యోతిక నటిస్తూ.. కెరియర్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ గా ఈ జంటలు చూపిస్తారు జనాలు . పెళ్లి తర్వాత ఈ జంట ఒక పాప ఒక బాబుతో లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా జ్యోతిక అలుపెరగని మహిళగా తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ.. జనాల చేత శభాష్ అనిపించుకుంటుంది. అయితే తాజాగా కోలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం జ్యోతికకు బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చిందట.
గత కొంతకాలంగా ఆమె బ్యాక్ బోన్ ప్రాబ్లం గా బాధపడుతూ ఉందట. ఈ విషయం బయటకు చెప్పని జ్యోతిక.. గత వారం రోజుల నుంచి ఆ నొప్పి మరింత ఎక్కువ అవ్వడంతో లేవలేని పొజిషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి . ప్రజెంట్ జ్యోతిక హాస్పిటల్లో ఉన్నట్టు తెలుస్తుంది . అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్, టాలీవుడ్ జ్యోతిక అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఆమె ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వాలి సూర్య అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ వార్తపై సూర్య, జ్యోతిక ఎలా స్పందిస్తారో..?