జక్కన్న జపాన్ ట్రిప్ అందుకేనా..?

Satvika
తెలుగు దర్శక ధీరుడు రాజమౌలి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఆయన తీస్తున్న సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును పొందాయి..మొదటి నుంచి తీస్తున్న సినిమాలు అన్నీ కూడా బాక్సాఫిస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టడంతో పాటు ఎన్నో అవార్డులను కూడా అందించింది..ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మూవీ 'ఆర్ఆర్ఆర్' ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే..



మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను హీరోలుగా పెట్టి, ఓ పీరియాడిక్ ఫిక్షన్ కథను ఆయన తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాలో చరణ్, తారక్‌ల పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు..అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక, గ్లోబల్ ఆడియెన్స్ ఈ సినిమాను బాగా ఆదరించారు. వారు ఇదొక మాస్టర్‌పీస్ అంటూ కితాబివ్వడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే గుర్తింపును తెచ్చుకుంది. 



ఇక తాజాగా ఈ సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు ఆర్ఆర్ఆర్ మేకర్స్ రెడీ అవుతున్నారు. అక్టోబర్ 21న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జపాన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేసేందుకు రాజమౌళి స్వయంగా జపాన వెళ్లేందుకు రెడీ అయ్యాడు. ఆయన గత చిత్రాలు బాహుబలి, బాహుబలి-2 జపాన్ వాసులకు పిచ్చపిచ్చగా నచ్చడంతో అక్కడ ఈ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టాయి. దీంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తుందని జక్కన్న అండ్ టీమ్ ఆశిస్తున్నారు.



ఇక తన సినిమాలను ఆదరిస్తున్న జపాన్ ప్రేక్షకులను నేరుగా కలిసేందుకు తాను జపాన్ వస్తున్నట్లుగా రాజమౌళి తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. మరి ఆర్ఆర్ఆర్ చిత్రంతో జక్కన్న జపాన్ దేశంలో హిట్ ను అందుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.. రాజమౌలి నెక్స్ట్ ఎవరితో ఉంటుందో అని చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: