టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల నటించిన పుష్ప సినిమా గత ఏడాది డిసెంబర్ లో విడుదల ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.ఇకపోతే ఇందులో అల్లు అర్జున్, రష్మిక మందన్న నటనతో పాటు డాన్స్ స్టెప్పులు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఇందులో డైలాగులు పాటలు ఈ సినిమా విడుదలైన కొన్ని నెలల వరకు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ వచ్చాయి.
అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.అంతేకాదు అలాగే హీరోయిన్ రష్మిక కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ముఖ్యంగా రారా సామీ, ఊ అంటావా మావా అనే పాటలు దేశవ్యాప్తంగా మారుమోగిపోయాయి. అయితే ఈ పాటలకు కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా స్టెప్పులు వేశారు.అంతేకాదు అందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇక ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదని, ఇది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఈ చిత్రంలో నేను లేకుంటే ఇంత ప్రేమను పొందడానికి నాకు దాదాపు 20 సంవత్సరాలు పట్టేది. అయితే పుష్ప-2 పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక దానికి తగ్గట్లుగానే ప్రయత్నిస్తాం అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్...!!