మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ మూవీ అయినటువంటి లూసిఫర్ మూవీ కి రీమేక్ గా తెరకెక్కింది. ఈ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సల్మాన్ ఖాన్ , సత్యదేవ్ , నయన తార ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. అక్టోబర్ 5 వ తేదీన తెలుగు మరియు హిందీ భాషలలో ఈ మూవీ ని విడుదల చేయనున్నారు.
ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా గాడ్ ఫాదర్ మూవీ యూనిట్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా జరిగిన గాడ్ ఫాదర్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ... విజయదశమి రోజున మా మూవీ తో పాటు స్నేహితుడు నా సోదరుడు ... నా శ్రేయోభిలాషి ... అక్కినేని నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీ కూడా విడుదల అవుతుంది. ఆ మూవీ కూడా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే యంగ్ బాయ్ గణేష్ హీరోగా తెరకెక్కిన స్వాతిముత్యం మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఆ మూవీ కూడా హిట్ అవ్వాలి. ఎందుకంటే చిన్న మూవీ లో పెద్ద మూవీలు రెండు ఆదరించబడిన రోజునే చిత్ర పరిశ్రమ పచ్చగా ఉంటుంది. ఈ మూడు మూవీలను మీరు ఆదరించి విజయదశమినాడు విజయవంతం చేయాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.