గ్రేట్
డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్
మూవీ రేపు అనగా
సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో చియన్
విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష ముఖ్య పాత్రలలో నటించగా , ఏ ఆర్ రెహమాన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ
మూవీ రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. అందులో మొదటి భాగం రేపు అనగా
సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల కానుంది. ఈ
మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , హిందీ , మలయాళ భాషల్లో ఒకే సారి విడుదల కాబోతోంది.
ఈ
మూవీ పై
తమిళ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ
మూవీ ని తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ
నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పొన్నియన్ సెల్వన్
మూవీ తెలుగు రాష్ట్రాలలో ఎన్ని
థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
నైజాం : 190 .
సిడెడ్ : 100 ప్లస్ .
ఆంధ్ర : 260 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి పొన్నియన్
మూవీ 550 ప్లస్
థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ
సినిమా బాక్సా ఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.