మంచు విష్ణు ఫ్యామిలీ ని ట్రోల్ చేస్తోంది వారేనా..?

Divya
మంచు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పైన తాజాగా మంచు విష్ణు మరొకసారి స్పందించడం జరిగింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ పై పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఇండస్ట్రీలో అంతా ఒకప్పుడు చాలా ఉమ్మడి కుటుంబంలో ఉండేవారు కానీ ఇప్పుడు ఎక్కువమంది బయట వాళ్ళు రావడం వల్ల మీడియా పెరగడం వల్ల తమని తాము పొగుడుకోవడం కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారని మంచు విష్ణు తెలియజేశారు. జిన్నా ప్రమోషన్లలో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో మంచి విష్ణు మాట్లాడొద్దు ట్రోలింగ్ పైన స్పందించారు.

ట్రోలింగ్ అనేది ప్రస్తుతం ఒక జనరల్ ట్రెండ్ గా మారిపోయింది ఇది ఇప్పుడే కాదు 1980లో కూడా మాక్సిన్లో పలు రూమర్స్ రాసేవారు అది పేపర్ అమ్మకానికి కొంతవరకు మాత్రమే ఉపయోగపడేది. కానీ ఇప్పుడు అలాంటి వాటిని లైట్ తీసుకున్నారు సినీ ఇండస్ట్రీ అంతా ఒకే కుటుంబం అని నమ్ముతున్నాము ఇండస్ట్రీలో తెర ముందు తెర వెనుక పని చేసే వారంతా ఒకే కుటుంబం అనుకుంటున్నాము అందుచేతనే ఇప్పుడు అంతా హోమ్లీగా లేము అని తెలియజేశారు. ఒకప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందంటే సినీ మీడియా దాన్ని ప్రింట్ చేసేవాళ్లు కాదు అలాంటివి రాయడం కరెక్ట్ కాదని వారు భావించి అలా చేస్తూ ఉంటారని తెలిపారు.

అంతలా ఉమ్మడిగా ఉండే వాళ్ళమని తెలిపారు. కానీ ఇప్పుడు ఎక్కువమంది బయట వాళ్ళు రావడం చేత మీడియా పెరగడం వల్ల  ట్రోలింగ్ పైన సైబర్ పోలీసులకు కంప్లైంట్ లు ఇవ్వడం జరుగుతోంది.మాకు రెండు ఐపి అడ్రస్సులు దొరికాయి అందులో ఒకటి జూబ్లీహిల్స్ లోని అడ్రస్ ఒకటి మరొకటి చెక్ పోస్ట్ వద్ద ఆఫీసులో ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు.ఆ రెండు అడ్రస్సులనుంచి ఒక పైడ్ బ్యాచ్ ఇలా చేస్తున్నారని తెలిపారు మంచు విష్ణు. ఈ విషయాలన్నీ తమకు పోలీసుల చెప్పారని తెలియజేశారు మంచు విష్ణు. ఇక ఈరోజు రేపు ఈ కేసు కోర్టులో కూడా నమోదు అవుతుందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: