మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ హౌస్ లో ఊహించని విధంగా ఎలిమినేషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి వారంలో ఎలిమినేషన్స్ నిరాకరించిన బిగ్ బాస్ రెండవ వారంలో ఏకంగా ఇద్దరినీ ఎలిమినేట్ చేశారు.ఇకపోతే అందులో షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. మూడవ వారంలో ఇనయ, ఆరోహి ఎలిమినేట్ అవ్వాల్సి ఉండగా ఊహించిన విధంగా నేహా చౌదరిని ఎలిమినేట్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు బిగ్ బాస్. ఇప్పుడు నాలుగవ వారం ఎలిమినేషన్స్ జరగబోతున్నాయి.. నాలుగో వారం ఎలిమినేషన్ కి ఎవరెవరు నామినేట్ అయ్యారు?
ఇక వారిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.ఇదిలావుంటే ఈ వారం ఐదు మంది మాత్రమే ఎలిమినేషన్ కి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక అందులో రాజశేఖర్, ఆర్ జె సూర్య, అర్జున్ కళ్యాణ్ తో పాటు సుదీప అలాగే ఆరోహీ డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈసారి అందరికంటే లీస్ట్ గా అర్జున్ కళ్యాణ్ అలాగే సుదీపా ఉన్నారు. ఇక వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరు ఎలిమిట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.. చాలా చోట్ల జరిగిన పోలింగ్లో సుదీపా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఆర్ జె సూర్య కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే వీరిద్దరి మధ్య ఎలిమినేషన్ అనేది జరుగుతుందని అంచనా వేస్తున్నారు. నాలుగో వారం సుదీప ఎలిమినేట్ అయితే హౌస్ మేట్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది. ఆర్ జె సూర్య ఎలిమినేట్ అయితే ఆరోహి ఒంటరిది అవుతుంది అని కూడా స్పష్టం అవుతోంది. అయితే అర్జున్ కళ్యాణ్ కూడా ఈ లిస్టులో చేరబోతున్నాడు అనే వార్తలు మరోపక్క వినిపిస్తున్నాయి. అంతేకాదు ముఖ్యంగా ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది శనివారం ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే..!!