ఐ కాన్ స్టార్
అల్లు అర్జున్ పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్
మూవీ తో పాన్
ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. పుష్ప ది రైస్
మూవీ మంచి విజయం సాధించడంతో పుష్ప ది రూల్
మూవీ పై ప్రస్తుతం దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లోనే పుష్ప ది రూల్
మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఐ కాన్ స్టార్
అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి
మూవీ ని సెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా
అల్లు అర్జున్ తన తదుపరి
మూవీ ని
తమిళ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన
అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే
అట్లీ , అల్లు అర్జున్ కు ఒక కథను వినిపించగా , ఆ కథ బాగా నచ్చిన
అల్లు అర్జున్ వెంటనే
అట్లీ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అలాగే
అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ మనీ హిస్ట్ వెబ్ సిరీస్ లైన్ కు కాస్త దగ్గరగా ఉండబోతున్నట్లు కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా
అల్లు అర్జున్ ,
అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే
మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్
డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
అట్లీ , షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న
జవాన్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ
మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.