ప్రముఖ తమిళ సీనియర్ స్టార్ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'పొన్నియన్ సెల్వన్: పార్ట్ 1'. పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల ఆధారంగా ఈ అద్భుతమైన చిత్రం రూపొందింది.'చియాన్' విక్రమ్, ఐశ్వర్య రాయ్, 'జయం' రవి, త్రిష, కార్తి వంటి అగ్ర నటులతో తెరకెక్కిన ఈ సినిమా నేడు (సెప్టెంబర్ 30న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మణిరత్నం దర్శకత్వం, భారీ తారగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు భారీగా నెలకొన్నాయి.ఇక ఎన్నో భారీ అంచల మధ్య నేడు విడుదలైన మూవీ తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలోని ప్రధాన పాత్రల పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో దాదాపు అందరు అగ్ర నటీనటులే ఉన్నారు. దీంతో ఎవరి పారితోషికం ఎంతనేది ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో పలు తమిళ వెబ్‌సైట్లు పొన్నియన్ సెల్వన్ నటీనటుల పారితోషికాలకు సంబంధించిన కథనాలు వెలువరించింది. వాటి ప్రకారం ఈ సినిమా కోసం చియాన్ విక్రమ్ రూ. 12 కోట్లు తీసుకున్నాడట.ఇంకా అలాగే బాలీవుడ్ బ్యూటీ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ రూ. 10 కోట్లు, జయం రవి రూ. 8 కోట్లు, కార్తి రూ. 5 కోట్లు తీసుకోగా త్రిష రూ. 2.5 కోట్లు అందుకుందని సమాచారం తెలుస్తుంది. నిజానికి జయం రవి కంటే కార్తికి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ. ఈ సినిమాలో జయం రవికి దక్కిన పాత్ర మెయిన్ పాత్ర కావడంతో ఆ కారణంగా ఆయనకి ఎక్కువ మొత్తం ఇచ్చారని అంటున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌పై సుభాస్కరన్, మణిరత్నం సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహామాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.మరి చూడాలి ఈ సినిమా మున్ముందు రోజుల్లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందో.