కార్తికేయ 2 డైరెక్టర్కి జాక్ పాట్.. ఏకంగా హృతిక్ తో మూవీ?

Purushottham Vinay
కార్తికేయ 2 డైరెక్టర్కి జాక్ పాట్.. ఏకంగా హృతిక్ తో మూవీ?


టాలీవుడ్‌లో ఉన్న యంగ్‌ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌లలో ఖచ్చితంగా చందూ మొండేటి ఒకరు. 'కార్తికేయ' సినిమాతో ఈ దర్శకుడు టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక దాని సీక్వెల్‌ 'కార్తికేయ2'తో అయితే దేశ వ్యాప్తంగా కూడా అఖండ విజయాన్ని అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు.చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఎక్కువ ప్రమోషన్స్ కూడా చేయకుండానే  ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు చేసి ఊహించని రికార్డు అందుకుంది. టోటల్ గా ఈ సినిమా వసూళ్లు 125 కోట్లు అని సమాచారం తెలుస్తుంది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం చాలా గ్రేట్.దీంతో ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌కు ఇప్పుడు అనేక వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్‌ ఇండియా ఫిల్మ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నారట. 


బాలీవుడ్‌కు చెందిన ఒకరిద్దరు బడా హీరోలతో ఈ సినిమా తీయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ హీరోలు ఎవరో తెలుసుకోవడం కోసం నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు.'కార్తికేయ2' తర్వాత అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌తో ఓ సినిమా చేసేందుకు చందూ మొండేటి చర్చలు జరిపారని టాక్‌. ఇక ఈ సినిమాలో హీరోలుగా బాలీవుడ్‌ హీరోలు హృతిక్‌ రోషన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ పేర్లు వినిపిస్తున్నప్పటికీ హృతిక్‌నే ఫైనల్‌ చేసే అవకాశమున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇదే నిజమైతే టాలీవుడ్‌ దర్శకుడు బాలీవుడ్‌ హీరో కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది. అయితే దీనిపై అటు గీతా ఆర్ట్స్‌ కానీ, ఇటు చందూ మొండేటీ కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరి చూడాలి చందూ మొండేటి అదృష్టం ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: