ఈ
మూవీ కి
మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సన్సేషనల్ మ్యూజిక్
డైరెక్టర్ ఎస్ ఎస్
తమన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందించాడు.
సల్మాన్ ఖాన్ , సత్య దేవ్ , నయన
తార ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ తెలుగు ట్రైలర్ ని కొన్ని రోజుల క్రితమే
మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ
మూవీ తెలుగు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే
గాడ్ ఫాదర్ మూవీ ని తెలుగు తో పాటు
హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. దానితో ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా హిందీ ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ తాజాగా విడుదల చేసింది.
గాడ్ ఫాదర్ మూవీ హిందీ ట్రైలర్ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ
మూవీ లో
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన
సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తూ ఉండడంతో , ఈ
మూవీ పై
హిందీ సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.