నవ్వుతూ కనిపించే కమెడియన్ ధనరాజ్ జీవితంలో.. ఇంత విషాదం ఉందా?
అంతేకాకుండా రాజు గారి గది సినిమాలో కూడా నటించి ఆకట్టుకున్నాడు ధనరాజ్. ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ కార్యక్రమం జబర్దస్త్ లో ధనాధన్ ధన్రాజ్ పేరుతో ఒక బృందాన్ని నడిపి అక్కడ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటికే కమెడియన్గా 70 కి పైగా సినిమాలు చేసిన ధనరాజ్ ఇటీవల నిర్మాతగా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. కాగా ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదట్లో తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పుకొచ్చాడు. సినిమాల్లో రాణించాలని కోరికతో తల్లికి చెప్పకుండా ఇంట్లో వంద రూపాయలు దొంగతనం చేసి హైదరాబాద్ వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.
ఫిలింనగర్ లో అవకాశాల కోసం తిరుగుతూ ఇక పొట్టకూటి కోసం ఒక హోటల్లో సర్వర్ గా కూడా పనిచేశాను అంటూ చెప్పుకొచ్చాడు ధనరాజ్. అయితే ఓసారి హైదరాబాద్ వచ్చిన తన తల్లి హోటల్లో తన సర్వర్ గా పని చేస్తున్న విషయం తెలుసుకుని ఎంతగానో బాధపడింది అంటూ తెలిపాడు. ఈ క్రమంలోని అపోలో ఆసుపత్రిలో ఆయాగా చేరిన తన తల్లి తనకు సహాయం గా ఉంది అంటూ తెలిపాడు. తర్వాత విజయ్ మాస్టర్ తో పరిచయం ఏర్పడింది. ఇక ఆయన ఇన్స్టిట్యూట్ బాగోగులు రెండు సంవత్సరాలు చూసుకున్నాను. చివరికి జై సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ప్రవేశించాను. తర్వాత జగడం సినిమా చేస్తున్నప్పుడు తల్లికి క్యాన్సర్ వచ్చిన విషయం బయటపడింది. ఇక సినిమా షూటింగ్ పూర్తికాకముందే తన తల్లి చనిపోవడంతో ఇక విషాదంలో మునిగిపోయాను అంటూ ధనరాజ్ చెప్పుకొచ్చాడు.