విడాకులకు సిద్ధమైన.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లి?

praveen
ప్రేమ పెళ్లి విడాకులు అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణం అన్న విషయం ఇప్పటివరకు ఎన్నో జంటలను చూసినప్పుడు అర్థమైంది. ఒకరిని విడిచి ఒకరూ ఉండలేక జీవితాంతం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకుని ఒకటైన వారు ఆ తర్వాత మాత్రం కలిసి ఉండడానికి కారణాలు లేక చివరికి విడిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలా విడిపోయిన తర్వాత ఎంతోమంది రెండవ వివాహం చేసుకొని హాయిగా జీవిస్తూ ఉంటే మరి కొంతమంది ఒంటరిగానే ఉండిపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో అయితే విడాకులకు సంబంధించిన పదం అటు ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తోంది

 ఎన్నో సెలబ్రిటీ జంటలు చిన్న చిన్న కారణాలతోనే చివరికి తమ వైవాహిక బంధానికి గుడ్ బాయ్ చెప్పేస్తూ విడాకులకు అప్లై చేస్తున్నారు. కొంతమంది పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే కోర్టు మెట్లు ఎక్కుతుంటే ఇంకొంతమంది ఎన్నో ఏళ్ల పాటు దాంపత్య జీవితంలో గడిపిన తర్వాత ఇక విడాకుల వైపు అడుగులు వేస్తూ ఉండడం గమనార్హం. ఇప్పుడు ఒక యంగ్ హీరోయిన్ కూడా ఇలాంటి బాటలోనే వెళ్ళబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ సొంత చెల్లి నిషా అగర్వాల్. ఇందుకు సంబంధించిన వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

 నిషా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులోనే కాకుండా మలయాల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అక్క కాజల్ అగర్వాల్ లాగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. 2013లో బిజినెస్ మాన్ అయినా మాన్ కరణ్ అనే వ్యక్తిని నిషా అగర్వాల్ వివాహం చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే ఎన్నో రోజుల నుంచి సాఫీగా సాగిపోతున్న వీరి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు వచ్చాయట. దీంతో భర్తతో విడాకులకు రెడీ అయిందంటూ టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం అక్క చెల్లెళ్లలో ఎవరైనా స్పందించే వరకు క్లారిటీ రాదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: