వామ్మో: త్రివిక్రమ్ చేతిలో అంత మంది హీరోలా..?
తాజగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అధినేత నాగ వంశీ తెలిపిన ప్రకారం త్రివిక్రమ్ దగ్గర చాలా మంది స్టార్ హీరోలు సినిమాలు చేయవలసిన సంఖ్య ఎక్కువగానే ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్ తో సాహో సినిమా విడుదలైనప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అలాగే వెంకటేష్ తో కూడా చేస్తానని ఎప్పుడూ మాట ఇచ్చారట అయితే ఇంకా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు గురించి ఎలాంటి విషయం తెలియజేయలేదని తెలిపారు. అలాగే మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తో కూడ ఒక సినిమా చేయవలసి ఉంది అలాగే చిరంజీవి తో కూడా చేయాలని నాగా వంశి తెలియజేశారు.
ప్రస్తుతం ఈ నిర్మాత చెప్పిందాన్ని భట్టి చుస్తే త్రివిక్రమ్ దగ్గర ఇతర హీరోల ప్రాజెక్టులు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు ఇక త్రివిక్రమ్ కూడా హీరోలతో వర్క్ చేయాలని ఆసక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది వారి కోసం కొన్ని కథలను కూడా రాసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ తో ఉంటుందని మొన్నటి వరకు వార్తలు వినిపించాయి కానీ ఆ విషయం తనవరకు ఇంకా క్లారిటీ రాలేదని నాకు వంశీ తెలియజేశారు. ఏదిఏమైనా త్రివిక్రమ్ డైరెక్షన్లో పనిచేయడానికి కొంతమంది హీరోలు ఉండడం విశేషం.