ఈ
మూవీ ని
అక్టోబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ
సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను కూడా విడుదల చేయగా , వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ది ఘోస్ట్
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి మరో సాంగ్ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. ది ఘోస్ట్
మూవీ నుండి 'దూరాలైన తీరాలైన' అనే రాప్ సాంగ్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ది ఘోస్ట్
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ని కూడా విడుదల చేసింది.
ప్రస్తుతం ది ఘోస్ట్
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ది ఘోస్ట్
మూవీ పై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.