టీజర్: ఆహింస టీజర్ సినిమా వైరల్..!!
అహింసా సిద్ధాంతాన్ని అనుసరించిన వ్యక్తి హింస కలిగినప్పుడు ఏం చేస్తారు అన్న కథ అంశంతో డైరెక్టర్ తేజ ఈ సినిమాను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో అభిరామ్ రఘు పాత్రలో కనిపించనున్నారు. పూర్తిగా అహింసకు వ్యతిరేకిస్తూ ఉంటారు. అయితే అనుకోని సంఘటనలతో అతని జీవితం ఒక మలుపు తిరుగుతుంది. ఇలా ఒక బలమైన పాయింట్ తో డైరెక్టర్ తేజ ఒక అందమైన ప్రేమ కథ తీసుకు వస్తున్నారని ఈ టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతుంది.
ఇందులో రఘు,అహల్య వంటి ఇద్దరు అమాయకుల ప్రేమ కథ చిత్రం గా తెరకెక్కించారు.ఇందులో అభిరామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా హీరోయిన్ గీతిక అహల్యగా కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సదా కూడా నటిస్తున్నది ఆర్పి పట్నాయక్ తన ఆహ్లాదకరమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. మొత్తం మీద డైరెక్టర్ తేజ మార్కే సినిమాని బాగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే విషయంపై చిత్ర బృందం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ గా మారుతోంది.