ఈ హీరో సంక్రాంతి బరిలో లేనట్టేనా..?
ఇకపోతే ఒకరిద్దరి హీరోలు ఇప్పటికే వారి సినిమాకు సంబంధించి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక సంక్రాంతి విడుదల కోసం అని. ఇప్పటినుంచే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రభాస్ ఆది పురుష్ సినిమా కూడా ప్రమోషన్స్ చేపడుతున్నారు. 3D టెక్నాలజీతో రామాయణం కథను తెరకేక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక మరొకవైపు చిరంజీవి నటించిన 154వ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతికి రాబోతోంది. ఇక నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా కూడా అదే సమయంలో రావచ్చని తెలుస్తోంది.. ప్రస్తుతం ప్రభాస్ , చిరంజీవి , బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఏదో ఒక సినిమాపై ప్రభావం అయితే పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎవరో ఒకరు వెనకడుగు వేయక తప్పదు.
ప్రభాస్ ఇప్పటికే ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి వెనక్కి తగ్గే అవకాశం లేదు..అందుకే మెగాస్టార్ చిరంజీవి లేదా బాలకృష్ణ సినిమాలు మాత్రమే వాయిదా పడే అవకాశం ఉంది. లేదా అంతకుముందే రావచ్చు అని కూడా తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ వెనక్కి తగ్గినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతి బరిలో బాలకృష్ణ లేనట్టే అని తెలుస్తోంది.