టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక తాజాగా ఆయన హీరోగా గాడ్ ఫాదర్ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ తెలుగు రీమేక్ గా దీన్ని రూపొందించారు.ఇక ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయగా సినిమాలో సల్మాన్ ఖాన్, నయన తార, సునీల్, సత్యదేవ్, సముద్రఖని వాటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.ఇకపోతే ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.అయితే పూర్తిగా సినిమాని మక్కీకి మక్కి దించేయకుండా తెలుగు ఆడియన్స్
మెచ్చే విధంగా కొన్ని ఆసక్తికరమైన మార్పులు చేయడంతో సినిమా మీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే ఇక గాడ్ ఫాదర్ సినిమా వసూళ్లను విషయంలో కూడా జోరు చూపిస్తోంది.అయితే ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 13 కోట్ల వరకు షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో సాధించగా రెండో రోజు కూడా దాదాపు ఏడు కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది.ఇకపోతే మూడవరోజు కూడా గట్టిగానే వసూళ్లు వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమా ఏకంగా మూడో రోజు కూడా అయిదు కోట్ల 50 లక్షల వరకు షేర్ రాబట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ముఖ్యంగా నైజాం ప్రాంతంలో మూడవరోజు కోటి రూపాయల అరవై లక్షల షేర్ రాబట్టిందని అలా మూడు రోజులకు గాను ఏడు కోట్ల 15 లక్షలు వసూలు చేసినట్లు అయిందని అంటున్నారు.ఇక మూడవరోజు కూడా బుకింగ్స్ బాగానే ఉన్నాయని ఐదున్నర కోట్ల దాకా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.అయితే నాలుగవ రోజు అంటే ఈరోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయని శనివారం కావడంతో పాటు సెలవు దినం కూడా కావడంతో బుకింగ్స్ బాగానే జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఇవి అంచనాలు మాత్రమే కాగా పూర్తి వసూళ్లు వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది..!!