ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు అయినటు వంటి
రాఘవ లారెన్స్ రెబల్
మూవీ కి దర్శకత్వం వహించగా , కృష్ణంరాజు ఈ
మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన రెబల్
మూవీ అప్పుడు ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది. కాకపోతే ఈ
మూవీ లో
ప్రభాస్ స్టైల్ కి , ఈ
సినిమా లోని సాంగ్స్ కి , అలాగే రెబల్
మూవీ లోని యాక్షన్ సన్నివేశాలకు మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికీ కూడా ఈ
మూవీ లోని యాక్షన్ సన్నివేశాలకు ఎంతో మంది ప్రేమికులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం మనకు తెలిసింది. అందులో భాగంగా
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా
తమన్నా , దీక్ష సేత్
హీరోయిన్ లుగా తెరకెక్కిన రెబల్
మూవీ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ
మూవీ ని
అక్టోబర్ 15 వ తేదీన రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.