సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రజనీ కాంత్ తాను నటించిన
మూవీ ల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించు కోవడం మాత్రమే కాకుండా ఎంతో మంది అభిమానులు అభిమానాన్ని కూడా సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
సూపర్ స్టార్ రజనీ కాంత్
తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి నెల్సన్
దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్
మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో
రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. అలాగే మిల్కీ
బ్యూటీ తమన్నా కూడా ఈ
మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ
మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన
పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ప్రస్తుతం జైలర్
మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
ఇది ఇలా ఉంటే
సూపర్ స్టార్ రజనీ కాంత్ తాజాగా లైకా
మూవీ ప్రొడక్షన్స్ సంస్థలో రెండు భారీ చిత్రాలకు సంతకం చేసినట్లు తెలుస్తోంది. రజనీ కాంత్ ఇప్పటికే లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో రోబో 2.0 మరియు
దర్బార్ మూవీ లలో నటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా
సూపర్ స్టార్ రజనీ కాంత్ సంతకం చేసిన సినిమాల్లో ఒక దానిని శిబి
చక్రవర్తి దర్శకత్వం వహించనుండగా , మరో
మూవీ ని పెరియాసామి దర్శకత్వం వహించబోతున్నట్లు
కోలీవుడ్ మీడియాలో ఒక టాక్ బలంగా వినబడుతుంది. ఇలా
సూపర్ స్టార్ రజనీ కాంత్ రెండు భారీ
మూవీ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.