గాడ్ ఫాదర్ డైరెక్టర్ నెక్స్ట్ మహేష్ తో !!

P.Nishanth Kumar
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిం చిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా రూపొందించిన ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి నటించడం తోనే ఈ సినిమా తప్పకుండా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా భావించారు. ఆ విధంగా దర్శకుడుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని మోహన్ రాజా తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడనే చెప్పాలి.

తమిళంలో పలు సినిమాలను రూపొందిం చి భారీ విజయాలను తన సొంతం చేసుకున్న ఈ దర్శకుడు తెలుగులో సినిమా చేయాలని చాలామంది కోరుకున్నారు. ఆ విధంగా ఆయన తొలి సినిమానే ఈ బ్లాక్ బస్టర్ సినిమా చే యడంతో ఒక్కసారిగా టాలీవుడ్ స్టార్ హీరోల కళ్ళు ఈ దర్శకుడు పై పడ్డాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ దర్శకుడు తన తదుపరి సినిమాను కూడా తెలుగు హీరోతో చేయబోతున్నాడు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మహేష్ బాబు ఈ దర్శకుడు తో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నాడట. త్వరలోనే ఓ మంచి కథ ను మహేష్ కి చెప్పి సినిమా ఒప్పించబోతున్నాడు మోహన్ రాజా.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో ఓ సినిమా చేస్తుండగా ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత మోహన్ రాజా సినిమా చేసే అవకాశం ఉంది. మ రి ఈ రెండు సినిమాలకు రెండున్నర మూడు సంవత్సరాలు పడుతున్న నేపథ్యంలో ఈ గ్యాప్ లో మోహన్ రాజా మరొక సినిమాను చేసి మళ్లీ మహేష్ తో సినిమా చేస్తాడా అనేది తెలి యాల్సి ఉంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: