ఆ సినిమా అనుష్క శెట్టి టీమ్ ను భయపేడుతోందా..!!
పూర్తి వివరాల్లోకి వెళితే నిశ్శబ్దం తర్వాత అనుష్క శెట్టి కాస్త విరామం తీసుకొని యువ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి ఒక సినిమాలో నటించబోతోంది అని వార్తలు బాగ వినిపించాయి. ఈ చిత్రాన్ని యువి క్రియేషన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా గత కొన్ని నెలలుగా చాలా సైలెంట్ గా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టీం మాత్రం బెల్లంకొండ గణేష్ నటించిన స్వాతిముత్యం సినిమాను చూసి చాలా టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కారణం స్వాతిముత్యం సినిమాలో సరోగసి వీర్య దానం అనే పాయింట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే అనుష్క, నవీన్ పోలిశెట్టి మధ్య కూడా ఇదే తరహాలో కథని రూపొందించినట్లుగా సమాచారం.
సిమిలర్ కథలు కావడంతో అనుష్క టీం కథలో పలు మార్పులు చేస్తారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో స్వాతి ముత్యం సినిమాకి ఈ కథకు దగ్గర పోలికలు ఉండడంతో పలు పాయింట్లు మార్పు చేయడానికి సిద్ధమైనట్లుగా చిత్ర బృందం సమాచారం. ఇక ఇటీవలే ఇలాంటి ఒకే కథతో విడుదలైన చిత్రాలు యావరేజ్ గా నిలిచాయని చెప్పవచ్చు. ఇక నాని నటించిన అంటే సుందరానికి నాగశౌర్య నటించిన కృష్ణ వ్రింద విహారి వంటి చిత్రాలు కూడా యావరేజ్ గానే నిలిచాయి. మరి అనుష్క నటిస్తున్న సినిమా పరిస్థితి ఏంటో చూడాలి.