జూనియర్ సమంత గా మారిన అషు రెడ్డి..!!

murali krishna
సోషల్ మీడియా ద్వారా స్టార్ గా మారి ఇండస్ట్రీలో బాగా దూసుకుపోతున్న స్టార్లలో ఒకరు అషూ రెడ్డి అని మనం చెప్పవచ్చు. ఇక ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియా ప్రియులకు, బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం  ఏమీ లేదు.

బుల్లితెర ఆర్టిస్ట్ గా అషు రెడ్డి తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి అభిమానాన్ని  తన సొంతం చేసుకుంది.

ఇక గతంలో రెండుసార్లు బిగ్ బాస్ హౌస్ లో పాల్గొని బాగా రచ్చ చేసింది. కానీ టైటిల్ విన్నర్ గా మాత్రం అషు గెలవలేకపోయింది. ఇక ఈ బ్యూటీ తన హాట్ అందాలతో మాత్రం కుర్రాళ్ళను తన వైపు మలుపుకుంది. నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో  ఎక్కువ సమయం గడుపుతుంది.

నిజానికి అషూ డబ్స్మాష్ వీడియోలతో తొలిసారిగా నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ చూడటానికి సమంతలా కనిపించటంతో ఆ గుర్తింపుతోనేఇప్పుడు ఇక్కడికి చేరుకుంది. ఇక సమంత లుక్ ను పోలి ఉండటంతో అందరి దృష్టిలో పడటంతో జూనియర్ సమంత అని పేరు  కూడా సంపాదించుకుంది. అలా ఎటువంటి అడ్డంకులు లేకుండానే వెండితెరపై కూడా అవకాశం అందుకుంది.

కానీ ఒక సినిమాతోనే అవకాశం అందుకొని ఆ తర్వాత వెండితెరకు గుడ్ బై చెప్పేసింది. నిజానికి తనకు వెండితెరపై ఎటువంటి అవకాశాలు రావట్లేదు అని చెప్పవచ్చు. ఇక బిగ్ బాస్ షో తర్వాత అషు రెడ్డి కెరీర్ పీక్స్ లోకి వెళ్ళింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పవర్ స్టార్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్టు సంపాదించుకుంది.

  గతంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసిన రచ్చ గురించి సోషల్ మీడియా ప్రేక్షకులకు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో తెగ పుకార్లు కూడా వచ్చాయి. ఇక బుల్లితెరలో ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షోలో లేడీ కమెడియన్ గా అడుగు పెట్టి తన కామెడీతో ఓ గుర్తింపు సొంతం చేసుకుంది. కానీ అక్కడ కూడా ఎక్కువ కాలం  ఉండ లేకపోయింది.
ఇక అక్కడ కూడా మరో కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది. ఏకంగా ముద్దులు పెట్టి, హగ్ లు ఇచ్చి అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత యాంకర్ రవి తో కలిసి ఓ షోలో యాంకర్ గా కూడా చేసి బాగా రెచ్చిపోయింది. అంతలోనే ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అవకాశం అందుకుంది. ఇక ఇందులో కూడా అషు మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇందులో మరో కంటెస్టెంట్ అజయ్ తో బాగా రచ్చ చేసింది.

  రెండుసార్లు బిగ్ బాస్ లో అడుగు పెట్టినప్పటికీ కూడా వెండితెరపై ఎటువంటి అవకాశం అందుకోవటం లేదు మరి . ఇక బిగ్ బాస్ తర్వాత మళ్లీ నెట్టింట్లో తన రచ్చ మొదలు పెట్టింది. ప్రతి రోజు ఫోటోలు షేర్ చేసుకుంటూ తెగ లైకులు సంపాదించుకుంటుంది. అప్పుడప్పుడు ఈమె చేసే పోస్టులను చూసి నెటిజన్లు దారుణమైన ట్రోల్స్, కామెంట్లు పెడుతూ ఉంటారు.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది. అందులో తన చీరకట్టులో తన బ్యాక్ ఫోటో చూయించింది. ఇక ఆ ఫోటోకు ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇంతకు అదేంటంటే.. నా బ్యాక్ ప్రజలకు నచ్చుతుంది. అలాగే నా వెనకాల ఎప్పుడు ఏదో ఒక దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. అలా ప్రతి చోటు వెన్నుపోటునే ఉంటుంది అని  ఇలా కామెంట్  చేసింది. ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: