ఆ వార్తలను కొట్టి పారేసిన దేవిశ్రీప్రసాద్..!!
ఈ వార్తలపై దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ సల్మాన్ ఖాన్ నటించబోతున్న తదుపరి చిత్రానికి అన్ని పాటలకు తానే సంగీతం అందించమని తనను ఎవరు కోరలేదని తెలియజేశారు. తన సంప్రదించే సమయానికి చిత్రంలో అన్ని పాటలు ఉన్నాయని దర్శకుడు పూర్తిగా వినిపించరట. ఆ పాటలు వినిపించాలని కోరారని చెప్పారట. కథ వినిపించే సమయంలో చాలా పాటలకు చోటు ఉందని రన్ టైం ఎక్కువగా పెరగడంతో పాటల సంఖ్య కాస్త తగ్గించాలని చెప్పారట. ఈ విషయాన్ని దేవిశ్రీప్రసాద్ దగ్గర కూడా చెప్పారట.
అయితే సల్మాన్ ఖాన్ కోసం ఒక క్రేజీ సాంగ్ మాత్రం కంపోజ్ చేసి ఇస్తానని తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం పుష్ప -2 సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉన్నారు అలాగే బాలీవుడ్ లో దృశ్యం-2 రోహిత్ శెట్టి సర్కస్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు దేవిశ్రీప్రసాద్ అలాగే కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు కూడా తన 42 రెండోవ సినిమా అని దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నట్లుగా సమాచారం. దీంతో సల్మాన్ ఖాన్, దేవిశ్రీప్రసాద్ మధ్య విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ మాత్రం చాలా వైరల్ గా మారుతున్నాయి.