అలాంటి మాటలు విని విని విసుగంటున్న మృణాల్ ఠాగూర్..!!
కెరియర్ ప్రారంభంలో పడ్డ కష్టాలు ఎదురైన సవాళ్ల గురించి తను ప్రస్తావిస్తూ ప్రస్తుతం తనకు వచ్చిన అవకాశాలతో చాలా సంతోషంగా ఉన్నానని కొంతమంది దర్శకులు తనపై నమ్మకంతో ఆఫర్లు ఇస్తున్నారని తెలియజేసింది. ఈ క్రమంలోనే వయస్సు ప్రేమ పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసింది. చాలామంది తన వయసెంత అని అడుగుతున్నారు తన వయసు 30 అని చెప్పగానే పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తున్నారని తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అంతే కాకుండా పెళ్లిపైన మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నలతో వేధిస్తున్నారని తెలియజేసింది.
అలాంటి వారికి వెంటనే నేను గుడ్ భై చెప్పేస్తానని మృణాల్ ఠాగూర్ తెలియజేసింది. అలాగే 20 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమ 30 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమకు చాలా డిఫరెన్స్ ఉందని తెలియజేసింది 20 ఏళ్లలో ముఖ్యమైన విషయాలు గురించి ఎక్కువగా పట్టించుకోరని 30 ఏళ్లు వచ్చేసరికి లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలో అలాగే జీవితం పైన ఒక క్లారిటీ వస్తుందని తెలియజేసింది ముద్దుగుమ్మ. అదే సమయంలో తనకు చిన్నప్పుడు హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ ల పైన చాలా క్రష్ ఉండేదని.. వారి ఫోటోలను బుక్కులో కూడా దాచిపెట్టుకునే ధాన్యాన్ని తెలిపింది అలాంటి వారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపింది.