యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో
బ్లాక్ బస్టర్ మూవీ లలో
హీరో గా నటించి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ మరి కొన్ని రోజుల్లో
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది వరకే
జూనియర్ ఎన్టీఆర్ ,
కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్
మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం అందుకోవడంతో , వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే తదుపరి
మూవీ పై
ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆ అంచనాలకు మించి ఈ
మూవీ ని తొమ్మిది భాషలలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది .
అలాగే ఈ
మూవీ లో
జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే స్లిమ్ లుక్ లో కనబడబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
మూవీ అప్పుడు ప్రారంభం కాబోతోంది ... ఇప్పుడు ప్రారంభం కాబోతుంది అంటూ అనేక తేదీలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ
సినిమా స్క్రిప్ట్ పక్కా గా రెడీ అయిన తర్వాతే సెట్స్ పైకి వెళ్ళాలి అని
కొరటాల శివ అనుకోవడంతో ఈ
సినిమా ఎన్ని రోజుల పాటు సెట్స్ పైకి వెళ్లకుండా ఆగిపోయినట్లు తెలుస్తోంది.
కొరటాల శివ ఇప్పటికే ఈ
మూవీ ఫైనల్ స్క్రిప్ట్ ని పూర్తి చేసినట్లు తెలుస్తుంది. దానితో
అక్టోబర్ 10 వ తేదీ తేదీన ఈ
మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించిన అప్డేట్ ను
మూవీ యూనిట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.